ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్త తన కోడలిని కన్నకూతురిగా చూసుకుంటుంది. కానీ మరి కొన్నిచోట్ల అత్త అదే అదునుగా భావించి అదనపు కట్నం కోసం, లేదా ఇంటి పనులను చక్కబెట్టడం కోసం కోడలిని ఎంతో దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటుంది. ఈ విధమైన చిత్ర హింసలు భరించలేక ఎంతో మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
గుంటూరు జిల్లా తెనాలిలో నివాసముంటున్న కోడలు ప్రియాంక తన అత్తపై చపాతీ కర్రతో దాడి చేసింది. ఈ విధంగా చపాతీ కర్రతో దాడి చేయడంతో అత్త మైథిలి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. కోడలు తన అత్తను చంపడానికి గల కారణం ఏంటని పోలీసులు ఆరా తీశారు.
ఈక్రమంలోనే అత్త మైథిలి తన కోడలు ప్రియాంకను తరచూ చిత్రహింసలకు గురి చేసేదని, ఈమె చిత్ర హింసలు భరించలేక వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని అత్త చిత్ర హింసలు భరించలేక ఆమెపై చపాతీ కర్రతో దాడి చేసిందని తెలుసుకున్న పోలీసులు కోడలు ప్రియాంకపై కేసు నమోదు చేశారు. ఈక్రమంలోనే డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించగా ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.