గత ఏడాది మొత్తం కరోనా విజృంభించడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి. క్రమక్రమంగా కరోనా కేసులు తగ్గడంతో సినిమా షూటింగ్ లు జరుపుకొని థియేటర్లు ఓపెన్ చేయగా సినిమా థియేటర్లలో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమపై పడిన దెబ్బ నుంచి కోలుకుంటున్న సమయంలో కరోన మరోసారి చిత్ర పరిశ్రమపై కాటు వేయనుంది. కరోనా కేసులు రోజు రోజుకు అధికమవుతున్నడంతో, ప్రభుత్వాలు బంద్ ప్రకటించుకున్నా, స్వచ్ఛందంగా థియేటర్లే బంద్ పాటించే పరిస్థితి కనబడుతోంది.
ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే సినిమాలను విడుదల చేసి కొంత వరకు ఆర్థికంగా నిలదొక్కుకున్న ప్రస్తుతం మాత్రం ముందు పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం థియేటర్లలో పవన్ కళ్యాణ్ వకీల్ షాబ్ తప్ప ఏ ఇతర సినిమాలు కనిపించడం లేదు.అదేవిధంగా ఉగాదికి విడుదల కావాల్సిన మరి కొన్ని సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కరోనా ప్రభావం వల్ల థియేటర్లు మూత పడితే ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా థియేటర్లలో కాకుండా ఓటీటీవైపు చూడాల్సిందేనని తెలుస్తోంది. ఓటీటీవారు ఈ సారి మాత్రం పే ఫర్ వ్యూ టైప్ ని అమలులో పెడతారని తెలుస్తోంది.