1967 వ సంవత్సరం ఏప్రిల్ 12 చరిత్రలో ఒక అద్భుతమైన రోజుగా మిగిలిపోయింది. మాస్కోలో ఉదయం 9:37 గంటలు. సోవియట్ యూనియన్ మొత్తం ఊపిరి బిగబట్టి ఆకాశం వైపు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అప్పుడే ఆకాశం నుంచి వోస్టాక్ -1 విమానం లాంచ్ అవగానే అందరిలో ఎంతో సంతోషం. మొట్ట మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ఓ వ్యక్తి అడుగుపెట్టాడు. అతనే యూరి గగారిన్.
1957 లోనే సోవియట్ యూనియన్ మొదటి ఉపగ్రహమైన స్పుత్నిక్ -1 ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. దీని తర్వాత అంతరిక్షంలోకి మనిషిని ప్రవేశపెట్టాలని ఎన్నో దరఖాస్తులు ఆహ్వానించారు. వీరందరికి ఎన్నో శారీరక కఠినమైన పరీక్షల అనంతరం కేవలం 19 మందిని ఎంపిక చేయగా వారిలో ఒకరిగా యూరి గగారిన్ నిలిచారు. ఈ విధంగా అంతరిక్షం నుంచి ఎంతో విజయవంతంగా తిరిగి వచ్చిన తర్వాత గగారిన్ వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.
1968 మార్చి 27 న అలాంటి ఒక శిక్షణా సమయంలో అతడి మిగ్ -15 ఓడ కూలిపోవడంతో యూరి గగారిన్, తోటి పైలట్ కూడా మరణించాడు. దీంతో 1968వ సంవత్సరంలో గగారిన్ గౌరవార్థం అతని స్వస్థలానికి గగారిన్ అనే నామకరణం చేశారు. దీంతో పాటు అతని పేరు కూడా చరిత్రలో నిలిచిపోయింది.