యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు (మే 20) తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న “ఆర్ఆర్ఆర్”చిత్రం నుంచి ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎంతో గంభీరమైన లుక్ లో పంచ కట్టుతో చేతిలో బళ్ళెం పట్టుకుని ఎంతో తీక్షణమైన చూపులతో ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుందని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్, పోస్టర్లు ఈ సినిమాలపై భారీ అంచనాలు పెంచుతున్నాయి.
తాజాగా తారక్ కరోనా బారిన పడటంతో తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే తన అభిమానులకు కూడా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని తెలిపారు.ఈ క్రమంలోనే తమ అభిమాన నటుడికి సోషల్ మీడియా వేదికగా మాత్రమే పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియ జేస్తున్నారు.