టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న రష్మిక తాజాగా ఇండియన్ క్రికెట్ టీం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. సినిమాలలో తన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఐపీఎల్ అంటే ఎంతో ఇష్టమని, తప్పకుండా ఐపీఎల్ ఫాలో అవుతానని తెలిపారు.
ఐపీఎల్‌లో తన ఫేవరెట్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పుకొచ్చింది. కానీ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని రేష్మిక తెలియజేశారు. విరాట్ కోహ్లీ కంటే టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె తెలిపింది. ధోని బ్యాటింగ్, కీపింగ్ అంటే తనకు ఇష్టమని ఈ సందర్భంగా రష్మిక తెలియజేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రష్మిక తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో కోయ యువతి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా బాలీవుడ్ లో కూడా అమితాబ్ బచ్చన్ తో కలిసి ఓ సినిమా, ‘మిషన్ మంజు’ అనే సినిమాల్లో ఆమె నటిస్తోంది.