తన అందంతోనే కాదు నటి రష్మిక మందన్న తన నటనతోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె నేషనల్ క్రష్‌గా కూడా మారింది. సినిమాల్లో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె అందరినీ అలరిస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఆమె గుండు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. అసలు ఆమె గుండు చేయించుకుందా ? ఏదైనా సినిమా కోసం అలా చేసిందా ? అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అసలింతకీ ఆ ఫొటోల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి ? అంటే…
తమిళనాడులో కొందరు సెలూన్ షాపుల వారు రష్మిక గుండుతో ఉన్న ఫొటోలను తమ బోర్డులపై పెట్టించారు. కేవలం వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే వారు చేసిన ఎత్తుగడ అని అర్థమైంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వెంటనే ఆ ఫొటోలను తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఆమె గుండు ఫొటోలు దర్శనమిచ్చే సరికి మీమ్స్ చేసే వారికి పండుగలా మారింది. వారు ఆ ఫొటోలపై ఫన్నీ మీమ్స్ సృష్టిస్తున్నారు. అయితే నిజానికి ఇలా జరగడం కొత్తమే కాదు. గతంలోనూ కీర్తి సురేష్, నయనతార లాంటి హీరోయిన్ల ఫొటోలు కూడా గుండుతో దర్శనమిచ్చాయి. కాగా రష్మిక తమిళంలో నటించిన తొలి మూవీ సుల్తాన్ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. అయితే ఆమె గుండు ఫొటోలు కనిపించడం మాత్రం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.