పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న వ్య‌క్తిని కారులోంచి కొట్టాడు.. వీడియో.. ఇలాంటి వారినేం చేయాలి ?

April 22, 2021 1:37 PM

పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న ఓ వ్య‌క్తిని అటు వైపుగా కారులో వెళ్తున్న ఇంకో వ్య‌క్తి వంగి మ‌రీ కొట్టాడు. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలో ఆ వ్య‌క్తిని కొట్టిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజన్లు పోలీసుల‌ను డిమాండ్ చేస్తున్నారు.

youth slapped man sleeping on pavement video

11 సెక‌న్ల నిడివి ఉన్న ఆ వీడియో క్లిప్‌లో ఓ వ్య‌క్తి పేవ్‌మెంట్‌పై నిద్రిస్తుండగా అటుగా కారులో వ‌చ్చిన ఓ యువ‌కుడు అందులోంచి వంగి మ‌రీ ఆ వ్య‌క్తిని చెంప దెబ్బ కొట్టాడు. దీంతో ఆ వ్య‌క్తి హఠాత్తుగా మేల్కొన్నాడు. ఇక కారులో ఆ యువ‌కుడితో ఉన్న ప‌లువురు బిగ్గ‌ర‌గా న‌వ్వ‌డం కూడా విన‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో క్లిప్‌ను ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. త‌రువాత ఆ వీడియో ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, వాట్సాప్‌ల‌లోనూ వైర‌ల్ అయింది.

https://youtu.be/zHkGYoT5n4k

ఇక సామాజిక కార్య‌క‌ర్త సయ్య‌ద్ అబ్‌దాహు క‌ష‌ఫ్ ఖాద్రి ఈ వీడియోను ట్విట్ట‌ర్ ద్వారా హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌, హైద‌రాబాద్ సిటీ పోలీస్‌, ఇత‌ర అధికారుల‌కు షేర్ చేసి ట్యాగ్ చేశారు. ఆ వ్య‌క్తిని కొట్టిన యువ‌కుల‌ను గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీంతో స్పందించిన పోలీసులు త‌ప్ప‌కుండా వారిని అదుపులోకి తీసుకుంటామ‌ని తెలిపారు. కాగా ఈ సంఘ‌ట‌న న‌గ‌రంలోని క‌లాప‌త్త‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో తాడ్‌బండ్ రోడ్డులో జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment