ప్రస్తుతం కాలంలో తెరకెక్కే సినిమాలు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు సైతం ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా ఒక భాషలో సినిమా తీయాలంటే కొన్ని కోట్ల ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటిది పాన్ ఇండియా స్థాయిలో అంటే భారీ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమా అంటే నటీనటులకు సైతం అధిక మొత్తంలో చెప్పాల్సి ఉంటుంది.
దర్శక నిర్మాతలు కూడా బడ్జెట్ కి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సినిమాలో క్వాలిటీ ఉండే విధంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు .ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ సినిమాలంటే భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సినిమాలన్నీ ఫాన్ ఇండియా స్థాయిలో రావడం విశేషం. ఇప్పటికే రాదే శ్యామ్, సలార్, ఆది పురుష్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రభాస్ -నాగ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమారు పది మంది బాలీవుడ్ సెలబ్రిటీలను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.ఈ క్రమంలోనే కేవలం నటీనటుల కోసం సుమారు 200 కోట్ల రూపాయలు నిర్మాతలు ఖర్చు చేయనున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ సమాచారం. కేవలం నటీనటుల కోసమే ఇంత ఖర్చు చేస్తుంటే ఒక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక నటించనున్నారు. జూలై లో షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కరోనా కారణం చేత అక్టోబర్ కు వాయిదా వేసినట్టు తెలుస్తోంది.