కొంతకాలం విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ ద్వారా వచ్చిన “వకీల్ సాబ్” ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పవర్ స్టార్ క్రిష్ దర్శకత్వంలో “హరహర వీరమల్లు “అనే చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియుమ్‌ను” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ సందడి చేయనున్నారని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఇందులో పవన్ భార్యగా నిత్య నటిస్తున్నట్లు తెలిపారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో రానా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇక రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ సందడి చేయనున్నారు.మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాకు తెలుగులో “పరశురామ కృష్ణ మూర్తి” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.