టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిన వారిలో కృతి శెట్టి ఒకరు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన “ఉప్పెన” సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఎంతో అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. మొదటి సినిమానే ఎంతో విజయవంతం కావడంతో ఈమె ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా కృతి శెట్టి ఓ సందర్భంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఉప్పెన సినిమా షూటింగ్ ముందు దర్శకుడు కొన్ని సినిమాలను చూడమని సలహా ఇచ్చారు. అయితే తాను చూసిన అన్ని సినిమాలలో కెల్లా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన”రంగస్థలం” సినిమా తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు.
రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా చూసిన తర్వాత నేను రామ్ చరణ్ కు పెద్ద అభిమానిగా మారిపోయానని, ఎప్పటికైనా తనతో కలిసి ఓ సినిమా చేయాలనే కోరిక ఉందంటూ తన మనసులోని మాటను ఈ విధంగా బయటపెట్టారు. ప్రస్తుతం ఈమె నాని సినిమాలో నటిస్తున్నారు.