టాలీవుడ్ సినిమాలో దర్శకుడిగా, రైటర్ గా, హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వారిలో విశ్వక్ సేన్ ఒకరు. నటనపై ఉన్న ఆసక్తితో 2017లో వెళ్ళిపోమాకే సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. తరువాత 2018 లో “ఈ నగరానికి ఏమైంది” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో సంతోషమ్ ఫిలిం అవార్డులో ఉత్తమ తొలి నటుడు అవార్డు అందుకున్నారు.
ఆ తర్వాత 2019లో ఫలక్నామా దాస్ సినిమాకు దర్శకుడిగా, హీరోగా మారి ఎంతో అద్భుతంగా నటించారు. 2020 సూపర్ హిట్ సాధించిన “హిట్” చిత్రానికి సీక్వెల్ సినిమా చేశారు. ఇక తాజాగా “పాగల్” సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే విశ్వక్ ఇంటర్వ్యూ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
విశ్వక్ తాను నటించే సినిమాలు కథ, అందులోని పాత్రలు ఆధారంగా, సినిమాలను ఎంపిక చేసుకుంటాను అని తెలిపారు.సినిమాల ఎంపిక విషయంలో రెమ్యూనరేషన్ అనేది తన చివరి ప్రాధాన్యత అంటూ, కథలో ప్రాధాన్యత ఉంటే అది కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలోనైనా నటించడం కోసం తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా విశ్వక్ సేం తెలిపారు