Lies : కొంతమంది అబద్ధాలు కూడా చెబుతూ ఉంటారు. అయితే చాలా మంది చెప్పే అబద్ధాలు ఇవి. మరి ఎక్కువగా ఎటువంటి అబద్దాలని చెప్తూ ఉంటారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. భూమిపై ఆత్మజ్ఞానంతో పుట్టిన మనుషులు నిరంతరం అబద్దాలని చెప్తూ ఉంటారు. కానీ ఈ అబద్ధాలని చెప్పడం మానేస్తే, నిండుగా జీవించడం కుదరదు. చాలా మంది మొదటగా చెప్పే అబద్ధం ఇది. నా వల్ల కాదు. ఈ పని నేను చేయలేను అని అంటుంటారు. చాలా మంది అటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం నేను అలా చేయలేను అని నమ్మించడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు కాదు దీని అంతు చూద్దాం అనే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు.
ఎప్పుడూ కూడా ఏ మనిషి నా వల్ల కాదు అనే మాట చెప్పకూడదు. ఇతరులకి సాధ్యమయ్యే పని వారికి కూడా సాధ్యమని, దానికి తగ్గట్టుగా శ్రమించాలి. వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలి. అలానే అంతా వాళ్ళ దురదృష్టం అని, సోమరులు చాలా సార్లు చెప్పడం మీరు వినే ఉంటారు. ఇది కూడా అబద్ధమే. ఎప్పుడు కూడా ఏదైనా పని చేయడానికి ఎంతగా శ్రద్ధ చూపిస్తున్నారు అనేది ముఖ్యం. కానీ అసలు ప్రయత్నం చేయకుండానే ఇదంతా దురదృష్టం, తలరాత, విధిరాత అని చెప్పుకోవడం మంచిది కాదు.

నూటికి నూరు శాతం శ్రమిస్తేనే, శ్రమించాలి తప్ప అదృష్టం బాగోలేదు. ఇది నా విధిరాత అలాంటివి చెప్పకూడదు. ఈ అబద్ధంతో కాలాన్ని గడిపేస్తే, ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాధ పడుతూ ఈ లోకం నుండి నిష్క్రమిస్తూ ఉంటారు. అలానే ప్రతి ఒక్కరు కూడా వారికి ఇంకా ఎంతో సమయం ఉందని తమని తాము మోసం చేసుకుంటూ ఉంటారు. మనిషికి ఉన్నది ఒకే ఒక్క జీవితం. పైగా రోజుకి కేవలం 24 గంటలు మాత్రమే ఉంటాయి.
గడిచిపోయిన సమయం మళ్లీ తిరిగి రాదు. కాబట్టి గతం గురించి బాధపడడం, భవిష్యత్తు గురించి కలలు కనడం మానేసి, వర్తమానంలో జీవిస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా శక్తికి మించి ప్రయత్నం చేయాలి. ఎక్కువ మందికి మేలు జరిగే విధంగా జీవితాన్ని మార్చుకోవాలి. ఎంతకాలం బతికామన్నది కాదు. ఎంత నిర్దిష్టంగా, ఎటువంటి విలువలతో బబతికామన్నది ముఖ్యం.