దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా కుమారుడి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సర్జా భార్య మేఘనా రాజ్ చిరంజీవి మరణం తర్వాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసినదే. ప్రస్తుతం ఐదు నెలల వయస్సు గల జూనియర్ సర్జా ఫోటోను మేఘనారాజ్ 2 రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన కొడుకుతో కలిసి ఉన్నటువంటి ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదివరకే మేఘన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేసిన చిరు చిన్నప్పటి ఫోటోను, ప్రస్తుతం జూనియర్ సర్జా ఫోటో పై నెటిజన్లు కామెంట్ చేస్తూ అచ్చం తండ్రిలాగే ఉన్నాడంటూ నెటిజన్ కామెంట్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీంతో తండ్రి కొడుకుల చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
2009లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీవి సర్జా 22 సినిమాలలో నటించి 2018 సంవత్సరంలో సినీ నటి మేఘనా రాజ్ ను ఏప్రిల్ లో వివాహం చేసుకున్నారు. 2020 జూన్ 7 న చిరంజీవి గుండెపోటుతో మరణించారు. చిరంజీవి మరణించిన 5 నెలలకు మేఘన అక్టోబర్ 22న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇంకా పేరు పెట్టని జూనియర్ చిరుకు ఐదు నెలల వయసు. ప్రస్తుతం జూనియర్ చిరు, చిరంజీవి సర్జా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.