సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్‌కు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం మహేష్ కు చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్సను అందిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మహేష్ కారు లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో మహేష్ తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే మహేష్ కు ప్రాణాపాయం తప్పిందని తాజాగా వార్తలు వచ్చాయి. కానీ అతని ఎడమ కంటి చూపు మాత్రం పూర్తిగా పోయిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు. కానీ సోషల్ మీడియాలో ఇలా ప్రచారం జరుగుతోంది.
మహేష్ కంటి చూపు పోయిందని అతని మేనమామ ఒకరు మీడియాకు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.