బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతివారం ప్రచారమవుతూ ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్న ఈ కార్యక్రమం అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రమోషన్లో భాగంగా ఎప్పటిలాగే అందరూ కమెడియన్లు తమ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా అందరినీ నవ్వించారు. హైపర్ ఆది, తాగుబోతు రమేష్, అదిరే అభి, రాకెట్ రాఘవ అదే విధంగా జడ్జ్ మనో కూడా స్టేజ్ పై తమ కామెడీ పంచులు ద్వారా సందడి చేశారు.ఎప్పటిలాగే ఈ వారం కూడా జబర్దస్త్ స్టేజీపై ఎమోషనల్ సన్నివేశాలు కొనసాగాయి.
తాజాగా నిర్వాహకులు విడుదల చేసిన ప్రోమోలో చివరిగా స్టేజ్ పైనే కమెడియన్ వెంకీ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఈ విధంగా వెంకీ ఏడవడంతో ఏమైంది అంటూ జడ్జీలు ప్రశ్నించగా.. అంతా తానే చేశానని మీరేమో అంటూ ఎమోషనల్ అయ్యారు.. అప్పుడు వీరు కూడా బాగా చేశారు కదా అంటూ జడ్జ్ అనగా వెంకీ వెనక్కి వెళ్ళిమరి ఎమోషనల్ అయ్యారు. అయితే నిజంగానే ఎమోషనలయ్యా రా.. లేకపోతే స్కిట్ లో భాగంగానే ఇలా చేశారా అన్న విషయం తెలియాలంటే కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు వేచి ఉండాలి. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.