దర్శకుడు మారుతీ ఏ చిత్రాన్ని తెరకెక్కించిన ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం అందరికీ కలుగుతుంది. ఎంతో విభిన్నమైన కథను ఎంపిక చేసుకొని దర్శకత్వం వహించే మారుతి తాజాగా మరొక సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. “ఏక్ మినీ కథ” ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఓ సినిమాను చేయడానికి మారుతి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు ఒక వెరైటీ టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతోందని సమాచారం వినబడుతోంది. సంతోష్ శోభన్ – మెహరీన్ జంటగా ఓటీటీ కోసం మారుతి ఈ సినిమా చేయడం విశేషం.
ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు” మంచిరోజులు వచ్చాయి” అనే టైటిల్ ను పెట్టాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధమైన టైటిల్ చూస్తుంటే కరోనా పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని సమాచారం. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను అధికారికంగా ప్రకటించడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే మారుతి దర్శకత్వంలో గోపీచంద్ రాశి ఖన్నా జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.