టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ ఫిలిమ్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా ఈ హీరోలకు జోడిగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, సీత పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నారు.అయితే నేడు అజయ్ దేవగన్ తన 52 వ పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
అజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు 12 గంటలకు విడుదలైన ఫస్ట్ లుక్ తో పాటు,మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది.అయితే షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా తొందరగా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 13న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు దర్శకుడు అధికారిక విడుదల తేదీని కూడా ప్రకటించారు.