సాధారణంగా సినిమా హీరోలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. అదేవిధంగా ఆ హీరోలు చేస్తున్న సినిమాలని ఇష్టపడే వారు కూడా ఉంటారు. అయితే ఈ అభిమానులు సినిమా రంగంలో వారు కాకుండా బయట వ్యక్తులు ఉంటారు. కానీ ఇదే రేంజ్ లో అభిమానం ఇండస్ట్రీకి చెందిన వారు చూపిస్తే ఎలా ఉంటుంది. ఈ క్రమంలోని తను పనిచేస్తున్న సినిమా పై ఉన్న అభిమానాన్ని ఓ అభిమాని ప్రదర్శించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమా టీమ్ లో పనిచేసే ఓ వ్యక్తి తన బుగ్గ మీద, తల వెనుక భాగంలోనూ ‘ఎ’ సింబల్ వచ్చేలా షేవ్ చేసుకున్న ఫోటోలను ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలకు దర్శకుడు స్పందిస్తూ ఈ విధమైన కమిట్మెంట్ ఉన్న టీమ్ తో పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆదిపురుష్ క్లాప్ బోర్డ్ చేతిలో పట్టుకుని అభిమాని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.
ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ క్రమంలోనే దర్శకుడు ఆ వ్యక్తి సినిమాపై చూపిన అభిమానానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన కొందరు అభిమానులు మరి ఈ రేంజ్ అభిమానం అవసరమా అంటూ తనదైన శైలిలో స్పందిస్తున్నారు.