బుల్లితెరపై ఎంతోమంది యాంకర్ లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిలో కొందరు మాత్రమే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు అవకాశాలను దక్కించుకుని తనదైన శైలిలో దూసుకుపోతోంది ఈ రాములమ్మ. ఈ క్రమంలోనే శ్రీముఖి పెళ్లి గురించి తెరపైకి రావటంతో స్పందించిన శ్రీముఖి తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది.
పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకుంది. పలు సినిమాలు, ప్రాజెక్టులను చేస్తూ వాటికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పింది.
ఈ క్రమంలోనే శ్రీముఖి ఫాలోవర్ ఒకరు”మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు. మీ పెళ్లి గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం” అనే ప్రశ్నను అడిగాడు. ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి స్పందిస్తూ..”నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు.మా అమ్మా నాన్నల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు హ్యాపీ ఉగాది”అంటూ శ్రీముఖి తెలియజేసింది. దీని కోసం ఆమె స్పెషల్ ఫిల్టర్ వాడడంతో నెటిజన్లు ఆ ఫోటోని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.