ప్రస్తుత కాలంలో కడుపులో ఆడపిల్ల ఉందని తెలిస్తే కడుపులోనే ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో ఊరు మొత్తం పది సంవత్సరాల నుంచి ఆడపిల్లలకు మాత్రమే జన్మనిస్తున్నారని తెలిస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. గత పది సంవత్సరాల నుంచి ఆ గ్రామం మొత్తం కేవలం ఆడపిల్లలు మాత్రమే పుడుతున్నారు. పదేళ్లగా ఒక మగ పిల్లాడు కూడా పుట్టకపోవడం ఎంతో ఆశ్చర్యం.దీంతో అక్కడి ప్రభుత్వం ఆ గ్రామంలో మగపిల్లాడు పుడితే ఆ కుటుంబానికి పెద్దఎత్తున బహుమతి చెల్లిస్తామని ప్రకటించారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో ఇక్కడ తెలుసుకుందాం..
అది పోలాండ్ చెక్ రిపబ్లిక్ సరిహద్దులోని గ్రామం పేరు మిజ్స్కే ఓడ్రేజ్ స్కీ. ఈ గ్రామంలో గత 10 ఏళ్లుగా ఆడపిల్లలు మాత్రమే పుడుతున్నారు. దీంతో ఈ గ్రామం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా 10 సంవత్సరాల నుంచి ఆడపిల్లలు మాత్రమే పుట్టడం వల్ల ఆ వూరిలో మగవారి శాతం పూర్తిగా తగ్గిపోయింది.ఈ క్రమంలోనే ఆ గ్రామంలో మగపిల్లాడు జన్మిస్తే వారికి పెద్దఎత్తున బహుమతి చెల్లిస్తామని అక్కడి ప్రభుత్వం తెలియజేసింది.
ఈ గ్రామంలో ఆడ పిల్లలు పుట్టడానికి గల కారణం ఏమిటని ఎంతోమంది పరిశోధకులు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ వీలు కాలేదు. ఎట్టకేలకు గత ఏడాది అనగా 2020 వ సంవత్సరం ఓ జంట ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ గ్రామం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ గ్రామంలో మగపిల్లాడు పుట్టడంతో గ్రామం మొత్తం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆ గ్రామం మొత్తం మగ బిడ్డకు జన్మనిచ్చిన దంపతులను సెలబ్రిటీలుగా చూస్తున్నారు. అయితే ఇప్పటికీ అక్కడ ఆడపిల్లలు పుట్టడం వెనుక గల రహస్యం మిస్టరీగానే మిగిలిపోయింది.