ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న గ్రంథాలయాల చుట్టూ తిరిగి ఎన్నో పుస్తకాలను తిరగేసేవారు. కానీ ప్రస్తుతం ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరూ గూగుల్ తల్లి పై ఆధారపడ్డారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీల గురించి, ఎడ్యుకేషన్ గురించి, షాపింగ్ గురించి గూగుల్ పై సర్చ్ చేయడం సాధారణం అయింది.ఇలాంటి క్రమంలోనే గూగుల్ ఇస్తున్న రిజల్ట్స్ చూసి కొన్ని సార్లు కొందరు ఎంతో షాక్ అవుతుంటారు. ప్రస్తుతం అలాంటి షాక్ లోనే యాంకర్ రవి ఉన్నారు.
బుల్లితెరపై వివిధ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ మేల్ యాంకర్లలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో రవి ఒకరు. దాదాపు 8 సంవత్సరాల నుంచి బుల్లి తెరపై తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రవి సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఒకప్పుడు రవి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వినిపించడంతో ఆ వార్తలకు చెక్ పెట్టడం కోసం రవి తన భార్య నిత్యను అందరికీ పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఈ జంట బాగా పాపులర్ అయ్యారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రవి తాజాగా తన భార్య నిత్యను ట్యాగ్ చేస్తూ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టాడు. అందులో గూగుల్ సెర్చ్ లో Worlds most beautiful couple అని టైప్ చేస్తే రవి, నిత్య ఫొటో చూపిస్తుందట. దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చేసిన రవి ఎంతో షాక్ అవుతారు తన స్టోరీ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తన భార్య నిత్యకు ట్యాగ్ చేస్తూ..”నిత్య.. ఇది నువ్వు చూశావా” అంటూ భార్యను అడిగాడు. అయితే ప్రస్తుతం గూగుల్ సెర్చ్ లో ఇవి రావడం లేదు. ఏదేమైనా గూగుల్ సెర్చ్ లో ఈ విధంగా తన ఫోటో రావడంతో యాంకర్ రవి ఫుల్ ఖుషి అయినట్టు తెలుస్తోంది.