టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న ఫ్యామిలీ లో అల్లు అరవింద్ ఫ్యామిలీ ఒకటి.ఈ విధంగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు.అందుకు గల కారణం హీరోయిన్ అను ఇమ్మానియేల్ అని చెప్పవచ్చు.షూటింగ్ లొకేషన్స్, బయట పార్టీలు, వ్యానిటీ రూంలో, కాఫీ షాప్ ఇలా ఎక్కడపడితే అక్కడే ఈ ఇద్దరూ హల్చల్ చేయడంతో నెటిజన్లు మాత్రం వీరి బంధానికి ప్రేమ అనే పేరు పెట్టారు.
తాజాగా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి మద్య స్నేహం ఏర్పడినట్లు అందుకే షూటింగ్ సమయంలో ఖాళీ దొరికితే ఈ జంట రచ్చ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.అయితే అను ఇమ్మానియేల్ బర్త్ డే సందర్భంగా అల్లు శిరీష్ లేట్ విషెస్ చెప్తూ చేస్తున్నటువంటి వీడియో అప్పట్లో వైరల్ అయింది.
తాజాగా అల్లు శిరీష్ అను ఇమ్మానియేల్ కి ఒక గిఫ్ట్ పంపాడు.ప్రెట్టీ లిటిల్ సైకో అంటూ రాసి ఉన్న టీ షర్ట్‌ను అను ఇమాన్యుయెల్‌కు అల్లు శిరీష్ పంపారు. అయితే దానిపై అను ఇమాన్యుయేల్ భిన్నంగా స్పందించారు. అది నేను కాంప్లిమెంట్ గా తీసుకుంటాను. నాకు సెట్ అయ్యే గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి అల్లు శిరీష్ స్పందిస్తూ మన ఇద్దరిలో కామన్ విషయాలు ఎన్నో ఎనీవే యు ఆర్ వెల్ కమ్ మై ఫేవరెట్ అంటూ డాష్ పెట్టడంతో నెటిజన్లు ఆ ఖాళీను వివిధ రకాలుగా ఊహించుకుంటూ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.