మీ దగ్గర పాత రూ.1 నోట్లు ఉన్నాయా ? అయితే వేల రూపాయలను పొందవచ్చు. పాత రూ.1 నోట్ల కట్టను కలిగి ఉంటే ఆ బండిల్‌కు రూ.45వేలు వస్తాయి. ఆన్‌లైన్‌లో ఈ నోట్లను ప్రస్తుతం చాలా మంది కొంటున్నారు. అందువల్ల ఈ నోట్లు ఉన్నవారు వాటిని అమ్మి డబ్బు పొందవచ్చు.
1957వ సంవత్సరానికి చెందిన రూ.1 నోట్లపై అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హీరుభాయ్ ఎం.పటేల్ సంతకం చేశారు. అలాంటి నోట్లను కలిగి ఉండడంతోపాటు వాటి నంబర్లు 123456 సిరీస్‌లో ఉంటే ఆ నోట్లకు కాయిన్ బజార్ అనే సైట్‌లో రూ.45వేలు పొందవచ్చు. ఆ నోట్లను అందులో విక్రయించి ఆ మేర డబ్బులు పొందవచ్చు.
ఇక పాత రూ.50, రూ.10, రూ.5, రూ.2 నోట్లను, పాత కాయిన్లను కూడా ఈ వెబ్‌సైట్‌లో విక్రయిస్తున్నారు. అందులో ఆయా నోట్లు, నాణేలను కొనాలన్నా, అమ్మాలన్నా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత అందులోకి లాగిన్ అవ్వాలి. అనంతరం అందులో సెక్షన్ల వారీగా ఉండే నోట్లు, నాణేలను కొనుగోలు చేయవచ్చు. పాత నోట్లు, నాణేలను సేకరించే వారికి ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.