ఈ-కామర్స్ సంస్థల బిజినెస్ రోజు రోజుకీ వృద్ధి చెందుతోంది. ఆన్ లైన్‌లో వస్తువులను కొనేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే వారికి వస్తువులను డెలివరీ చేసేందుకు సరైన సంఖ్యలో మ్యాన్ పవర్ ఉండడం లేదు. కానీ వస్తువుల డెలివరీ కోసం ఫ్రాంచైజీలను ఏర్పాటు చేస్తే దాంతో నెల నెలా చక్కని ఆదాయాన్ని పొందవచ్చు.
అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ సంస్థలకు చెందిన డెలివరీ ఫ్రాంచైజీని ఓపెన్ చేయాలంటే పెద్ద స్థలం ఉండేట్లు చూసుకోవాలి. వేర్‌హౌజ్‌కు దగ్గర్లో ఏదైనా స్థలాన్ని లీజుకు తీసుకుని షెడ్లు వేసి ప్రారంభించవచ్చు. లేదా అప్పటికే ఖాళీగా ఉండే చిన్నపాటి పరిశ్రమలకు చెందిన ఖాళీ స్థలాలను ఎంపిక చేసుకోవచ్చు. తరువాత సొంత వాహనం ఉండాలి. ఫోర్ వీలర్ అయితే మంచిది. ఎక్కువ సంఖ్యలో వస్తువులను త్వరగా డెలివరీ చేయవచ్చు.
ఇక సమీపంలోని ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ డెలివరీ హబ్ స్థానాన్ని తెలుసుకోవాలి. హబ్‌లోని మేనేజర్‌ను సంప్రదించాలి. డెలివరీ ఫ్రాంచైజీ గురించి వివరాలను తెలుసుకుని అవకాశం ఉంటే వెంటనే పనిని ప్రారంభించవచ్చు. ఒక ఫ్రాంచైజీ కోసం రూ.50వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు. మీరు వ్యాపారం మానేస్తే తిరిగి ఆ మొత్తాన్ని రీఫండ్ పొందవచ్చు.
ఫోర్ వీలర్ లేకున్నా టూవీలర్ ద్వారా అయినా వస్తువులను డెలివరీ చేయవచ్చు. కొద్ది మంది కలిసి ఇలా చేస్తే ఎక్కువ మొత్తంలో వస్తువులను డెలివరీ చేయవచ్చు. దీంతో ఎక్కువ కమిషన్ లభిస్తుంది. డెలివరీ హబ్‌లకు దగ్గరగా ఫ్రాంచైజీలను ప్రారంభిస్తే అక్కడి నుంచి సులభంగా వస్తువులను తెచ్చుకుని డెలివరీ ఇవ్వవచ్చు. దీంతో వేగంగా డెలివరీలను పూర్తి చేసి ఎక్కువ మొత్తంలో కమిషన్‌ను పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్‌లోనే ఎక్కువగా అనేక రకాల వస్తువులను కొనుగోలు చేస్తున్నారు కనుక డెలివరీ ఫ్రాంచైజీలకు ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. దీంతో చక్కని ఆదాయం పొందవచ్చు.