ఓలా సంస్థ తాజాగా రెండు నూతన ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్‌లో విడుదల చేసింది. గత కొద్ది రోజులుగా ఈ స్కూటర్లకు గాను ఓలా ప్రిబుకింగ్స్ ను నిర్వహిస్తోంది. రూ.499తో వీటిని బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ స్కూటర్లకు గాను 1 లక్షకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు ఓలా తెలియజేసింది.
ఎస్1, ఎస్1 ప్రొ పేరిట ఓలా విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.99,999 ఉండగా, ఎస్1 ప్రొ ధర రూ.1,29,999 గా ఉంది. వీటిని సౌకర్యవంతమైన ఈఎంఐ ప్లాన్లలోనూ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. కనీసం నెలకు రూ.2,999 చెల్లిస్తే చాలు, వీటిని సొంతం చేసుకోవచ్చు.
ఇక పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి పెద్ద మొత్తంలో సబ్సిడీని అందిస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌లో ఈ రెండు స్కూటర్లను చాలా తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఇవి అక్కడ వరుసగా రూ.79,999, రూ.1,09,999 ధరలకు లభిస్తున్నాయి. ఢిల్లీలో వీటి ధరలు రూ.85,099, రూ.1,10,499 ఉండగా, మహారాష్ట్రలో రూ.94,999, రూ.1,24,999గా ఉన్నాయి. అలాగే రాజస్థాన్‌లో రూ.89,968, రూ.1,19,138, ఇతర రాష్ట్రాల్లో వీటి ధరలు వరుసగా రూ.99,999, రూ.1,29,999గా ఉన్నాయి.
ఈ స్కూటర్లు 8.5 kW పవర్‌ను అందిస్తాయి. కేవలం 3 సెకన్లలోనే 0-40 kmph స్పీడ్ కు వెళ్లవచ్చు. 5 సెకన్లలో 0 నుంచి 60 kmph చేరుకుంటాయి. గంటకు గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో వీటిపై వెళ్లవచ్చు. వీటిల్లో నార్మల్, స్పోర్ట్, హైపర్ మోడ్స్ ను అందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…