కరోనా వల్ల ప్రస్తుతం చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు, ఉద్యోగులు పనికి ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో గత ఏడాది కాలంగా ల్యాప్‌టాప్ ల కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. అయితే ల్యాప్‌టాప్‌లను కొనాలని అనుకుంటున్న వారు ముందుగా చెక్ చేయాల్సిన ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ల్యాప్‌టాప్ కొనాలని అనుకునే వారు దాన్ని ఏవిధంగా, ఏ పనికి వాడాలనుకుంటున్నారో ముందుగా తెలుసుకోవాలి. సాధారణ పనులకు అయితే నార్మల్ ల్యాప్‌టాప్ సరిపోతుంది. అదే వీడియోల ఎడిటింగ్, గ్రాఫిక్స్, డిజైనింగ్ అయితే గ్రాఫిక్ కార్డు ఉన్న ల్యాప్‌టాప్‌ను తీసుకోవాలి. ఈ క్రమంలో కనీసం 4జీబీ కెపాసిటీ ఉన్న గ్రాఫిక్ కార్డు ఉండేలా ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవాలి. దీంతో గ్రాఫిక్స్, ఎడిటింగ్ పని సులభతరం అవుతుంది. ఇక సాధారణ పనులకు గ్రాఫిక్ కార్డు అవసరం లేదు. నార్మల్ ల్యాప్ టాప్ కొంటే చాలు.
సాధారణంగా ల్యాప్‌టాప్‌లో ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ కనీసం ఉండేలా చూసుకోవాలి. దీంతో ల్యాప్‌టాప్ వేగంగా పనిచేస్తుంది. అలాగే కనీసం 128జీబీ ఎస్ఎస్‌డీ అయినా ఉండేలా చూసుకోవాలి. ఎస్ఎస్‌డీ అంటే ఓ రకమైన హార్డ్ డిస్క్. ఇందులో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతుంది. సాధారణ హార్డ్ డిస్క్ కన్నా ఎస్ఎస్‌డీ వేగంగా పనిచేస్తుంది. కనుక ల్యాప్‌టాప్‌లో హార్డ్ డిస్క్‌తోపాటు ఎస్ఎస్‌డీని కూడా అందిస్తారు. ఎస్ఎస్‌డీలో విండోస్ సి డ్రైవ్ ఉంటుంది. మిగిలిన డ్రైవ్‌లు మనకు హార్డ్ డిస్క్‌లో ఉంటాయి.
ఎస్ఎస్‌డీ వల్ల ల్యాప్‌టాప్ వేగంగా పనిచేస్తుంది. కనుక కనీసం 128జీబీ ఎస్ఎస్‌డీ ఉండేలా ల్యాప్‌టాప్ తీసుకోవాలి. దీంతో పనిచేసే సాఫ్ట్‌వేర్లు వేగంగా ఉంటాయి.
ల్యాప్‌టాప్ కాన్ఫిగరేషన్ కింద చెప్పిన విధంగా ఉంటే మేలు. ఇది కనీస కాన్ఫిగరేషన్. ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసుకోవచ్చు. బడ్జెట్ ఉందనుకుంటే ఇంతకన్నా ఎక్కువ కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్ కొనవచ్చు.
ఈ విధంగా కాన్ఫిగరేషన్ ఉండేలా ల్యాప్‌టాప్ ను తీసుకుంటే వేగంగా పనిచేసుకోవచ్చు. గ్రాఫిక్ కార్డులు ఉన్న ల్యాప్‌టాప్‌లు ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. సాధారణ ల్యాప్‌టాప్‌లు ధర తక్కువగా ఉంటాయి. కనుక ఈ రెండు రకాల్లో ఏది అవసరమో తెలుసుకుని తరువాత ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తే మంచిది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…