మీకు పిఎస్ ఖాతా ఉందా.. అయితే మీకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సర్వీసులను అమలులోకి తెచ్చింది. ఈ సర్వీస్ ల వల్ల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కోసం కేవలం కొంత సమయంలోనే డబ్బులను పొందవచ్చు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సబ్‌స్క్రైబర్లు మెడికల ఎమర్జెన్సీ సమయంలో పీఎఫ్ అకౌంట్ నుంచి రూ.లక్ష వరకు వెంటనే విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఈపీఎఫ్‌వో జూన్ 1న ఒక సర్క్యూలర్ జారీ చేసింది.ఇందులో భాగంగా మెడికల్ అడ్వాన్స్ కింద రూ.లక్ష పొందొచ్చని తెలియజేసింది. కరోనా వైరస్ సహా ఇతర వ్యాధుల కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. ఈ మెడికల్ అడ్వాన్సు డబ్బులు కేవలం గంటలో ఖాతాదారుని అకౌంట్లో పడటంతో ఎంతో మంది లబ్ధిదారులకు ఈ విషయం ఊరటను కలిగిస్తోంది.
గతంలో కూడా ఈ విధమైనటువంటి సదుపాయాన్ని ఈపీఎఫ్‌వో తన సబ్స్క్రైబర్లు లకు కల్పించింది. కాకపోతే దీనికి వ్యయ అంచనాలను చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుతం దీనికోసం పీఎఫ్ ఖాతాదారులు ఎలాంటి వ్యయ అంచనాలను అందించాల్సిన పనిలేదని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.