కేరళ.. దీన్నే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు.. కేరళలో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. అద్భుతమైన పచ్చని ప్రకృతి ఎక్కడ చూసినా దర్శనమిస్తుంది. పచ్చని పర్వతాలు, సరస్సులు కళకళలాడుతుంటాయి. అందుకనే చాలా మంది కేరళకు టూర్ వేస్తుంటారు. అయితే ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు కేరళ వేదికగా మారింది. పెళ్లి కోసం చక్కని వేదికల గురించి వెదుకుతున్న వారు కేరళకు వెళ్లవచ్చు.
కేరళలోని కోవళం, వర్కల అనే రెండు ప్రాంతాల్లో ఉన్న బీచ్‌లు అద్భుతంగా ఉంటాయి. అందువల్ల డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ఇవి పర్‌ఫెక్ట్ వేదికలని చెప్పవచ్చు. 250 మంది అతిథులుకు వీలుగా సౌకర్యాలను కల్పిస్తారు. 150 నుంచి 175 మంది గెస్టులు వచ్చే ఒక్కో వివాహానికి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల ఖర్చు అవుతుంది.
ఇక వివాహానికి వచ్చే అతిథుల వినోదం కోసం అనేక ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే వారి కోసం ప్రత్యేక హోటల్స్, రిసార్టులు అందుబాటులో ఉన్నాయి. కేరళలో హౌజ్ బోట్‌లోనూ వివాహాది శుభకార్యాలు చేసుకోవచ్చు. ఒక్కో హౌజ్ బోట్‌కు రోజుకు రూ.25వేలు అద్దె చెల్లిస్తే చాలు, తక్కువ మంది అతిథులతో వివాహ కార్యం జరిపించవచ్చు.
పెళ్లి కోసం వచ్చే అతిథులకు ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌లో సకల సౌకర్యాలను కల్పించవచ్చు. అందుకు గాను ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయి. ఇక వివాహ వేడుకను కెమెరాల్లో బంధించేందుకు రూ.1 లక్ష చెల్లిస్తే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ లభిస్తారు. ఈ విధంగా కేరళలోని పర్యాటక ప్రాంతాల్లో వివాహాలు చేసుకోవచ్చు. కేవలం సెలబ్రిటీలే కాదు, సాధారణ ప్రజలు కూడా తక్కువ ధరల్లోనే డెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహించవచ్చు. అందుకు కేరళ ఆతిథ్యం ఇస్తోంది.