వేసవికాలం వచ్చిందంటే మనకు మామిడిపండ్ల సీజన్ మొదలవుతుంది ఈ క్రమంలోనే మామిడిపండు తో వివిధ రకాల రెసిపీలను తయారు చేసుకొని తింటారు. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టపడే మ్యాంగో కుల్ఫీ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*పాలు అర కప్పు
*మామిడిపండు గుజ్జు ఒక కప్పు
*కండెన్స్‌డ్ మిల్క్ పావు కప్పు
*పంచదార 3 టేబుల్ స్పూన్లు
*కోవా 50 గ్రాములు
తయారీ విధానం
ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి పాలను బాగా మరిగించాలి. పాలు బాగా మరిగిన తరువాత దీనిలోకి
కండెన్స్‌డ్ మిల్క్, పంచదార వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమంలోకి కోవా వేసి చిన్న మంటపై ఉడికించాలి. ఈ విధంగా ఈ మిశ్రమం మొత్తం ఐదు నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆ మిశ్రమంలోకి మామిడి పండు గుజ్జును వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ విధంగా బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌లో పోసుకోవాలి. 6 నుంచి 8 గంటలపాటు డీప్ ఫ్రిజ్‌లో ఉంచుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగో కుల్ఫీ రుచిని ఆస్వాదించవచ్చు.