కుక్కలు ఎంతో పురాతన కాలం నుంచి మనుషులకు అత్యంత దగ్గరైన, మచ్చికైన జంతువుగా మెలుగుతున్నాయి. మనుషులపై శునకాలకు భలే విశ్వాసం ఉంటుంది. యజమాని సరిగ్గా చూసుకోవాలే కానీ యజమాని కోసం ఏం చేయడానికైనా శునకాలు వెనుకాడవు. వాటికి సరైన శిక్షణ ఇస్తే ఎన్నో అద్భుతాలను చేస్తాయి.
అయితే శునకాలు ఎంత విశ్వాసపాత్రమైనవో కింద ఇచ్చిన వీడియోను చూసి అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియోలో ఓ వృద్ధురాలు తన కుమార్తెను కర్రతో కొట్టినట్లు నటిస్తుండగా వారి పెంపుడు కుక్క అలా చేయకుండా అడ్డు పడింది. కర్రతో కొట్టడానికి వచ్చిన మహిళను వద్దన్నట్లు ఆ కుక్క వారించింది. కాగా ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram
శునకాలు చాలా విశ్వాసంగా ఉంటాయి. యజమానుల పట్ల విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. యజమాని కోసం ఏమైనా చేస్తాయి ? అని పైన ఇచ్చిన వీడియో ద్వారా అర్థమవుతుంది.