టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అందిస్తున్న రూ.349, రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్లకు గాను పలు మార్పులు చేర్పులు చేసింది. ఈ రెండు ప్లాన్లకు ఇకపై మరింత డేటా లభించనుంది. అలాగే వీటి వాలిడిటీని కూడా పెంచారు.
రూ.349 ప్లాన్ ద్వారా ఇకపై యూజర్లకు రోజుకు 2.50 జీబీ డేటా లభిస్తుంది. గతంలో 2జీబీ మాత్రమే లభించేది. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా వాడుకోవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ లైబ్రరీకి ఉచిత యాక్సెస్ లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.
అలాగే రూ.299 ప్లాన్‌లో గతంలో 28 రోజుల వాలిడిటీ ఉండేది. దాన్ని 30 రోజులకు పెంచారు. దీంతోపాటు యూజర్లకు 30జీబీ ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.