సూపర్ స్టార్ మహేష్ బాబు హోలీ పండుగ సందర్భంగా తన అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవలే సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ దుబాయ్‌లో పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా హోలీ పండుగ సందర్భంగా మహేష్ ట్విట్వర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు.
అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి అందరం బాధ్యతగా ఉంటూ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుందాం. ఈ హోలీ మీకు ప్రియమైన వారి నుంచి మరింత ప్రేమను అందించాలి.. అని మహేష్ అన్నాడు.
Wishing you all a very Happy Holi!! As the COVID-19 cases surge again.. Let's be responsible and celebrate the festival with our family… A Holi filled more with love from your loved ones ♥️#StaySafe #CelebrateAtHome
— Mahesh Babu (@urstrulyMahesh) March 29, 2021
కాగా సర్కారు వారి పాట మూవీని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2022 జనవరిలో విడుదల కానుంది. ఇక ఇటీవలే మహేష్ కు చెందిన మహర్షి మూవీకి 2 నేషనల్ ఫిలిం అవార్డులు లభించాయి. దీంతో మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సర్కారు వారి పాట మూవీ తదుపరి షెడ్యూల్ గురించి ఎప్పుడు వార్త చెబుతారా ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.