IPL 2022 : ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 7వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్ జియాంట్స్ అద్భుతమైన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని సైతం లక్నో సునాయాసంగా ఛేదించింది. ఈ క్రమంలో చెన్నై జట్టుపై లక్నో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. చెన్నై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలోనే చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లలో రాబిన్ ఊతప్ప (50 పరుగులు), శివమ్ దూబె (49 పరుగులు)లు రాణించారు. అలాగే లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్‌లు తలా 2 వికెట్ల చొప్పున తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. లక్నో బ్యాట్స్‌మెన్‌లలో క్వింటన్ డికాక్ (61 పరుగులు), ఎవిన్ లూయీస్ (55 నాటౌట్), కెప్టెన్ రాహుల్ (40 పరుగులు)లు రాణించారు. చెన్నై బౌలర్లలో డ్వానె ప్రిటోరియస్ 2 వికెట్లు తీయగా.. తుషార్ దేశ్ పాండే, డ్వానె బ్రేవోలు చెరొక వికెట్ చొప్పున తీశారు.