OTT : శుక్రవారం వచ్చిందంటే చాలు.. అటు థియేటర్లతోపాటు ఇటు ఓటీటీల్లోనూ కొత్త సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ఎప్పటికప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలను వారు చూస్తున్నారు. ఇక ఈ శుక్రవారం కూడా పలు కొత్త సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల కానున్నాయి. ఇక ఆ మూవీల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మళయాళ స్టార్ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం.. భీష్మ పర్వం. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమ్ కానుంది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. కౌన్ ప్రవీణ్ తాంబే అనే హిందీ మూవీ కూడా ఇదే ప్లాట్ ఫామ్‌పై నేటి నుంచి స్ట్రీమ్ అవుతోంది. స్పోర్ట్స్ కథాంశంతో దీన్ని తెరకెక్కించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో నేడు రెండు మూవీలు రిలీజ్ కానున్నాయి. ది బబుల్ అనే కామెడీ ఇంగ్లిష్ మూవీతోపాటు అపోలో: ఎ స్పేస్ ఏజ్ అడ్వెంచర్ అనే యానిమేషన్ మూవీని కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేస్తున్నారు.
ఆహా ప్లాట్‌ఫామ్‌పై జూన్ అనే తెలుగు సినిమా నేడు విడుదల కానుంది. డ్రామా జోనర్‌లో ఈ మూవీని నిర్మించారు. ఇక ప్రభాస్, పూజా హెగ్డె జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమా కూడా నేడు ఓటీటీలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ లో దీన్ని స్ట్రీమ్ చేయనున్నారు. ఇక దుల్కర్ సల్మాన్, అదితి రావు హైదరి, కాజల్ అగర్వాల్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన హే సినామిక మూవీ గురువారమే ఓటీటీలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌తోపాటు జియో సినిమా యాప్‌లలో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది.
శర్వానంద్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ మూవీ శనివారం నుంచి స్ట్రీమ్ కానుంది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు.