Janhvi Kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. తన నటనతో ఈమె అందరినీ ఆకట్టుకుంది. ఈమె నటించిన చిత్రాలు అంతగా హిట్ కాలేదు. కానీ నటిగా ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. అయితే జాన్వీ కపూర్‌కు ప్రస్తుతం తెలుగులో వరుస సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె టాలీవుడ్‌కు ఎన్‌టీఆర్ చిత్రంతో పరిచయం అవుతుందని కన్‌ఫామ్ అయింది. ఎన్టీఆర్‌తో కలిసి జాన్వీ కపూర్ తెలుగు వెండితెరకు పరిచయం కానుందని.. ఆమె తండ్రి బోనీ కపూర్ ఇటీవలే స్వయంగా వెల్లడించారు.

అయితే ఎన్టీఆర్‌తో చేయనున్న మూవీని ఇంకా అధికారికంగానే ప్రకటించలేదు. ఆ వివరాలు ఇంకా పూర్తిగా తెలియవు. కానీ జాన్వీకి అప్పుడే ఇంకో సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన (జేజీఎం) అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం విదితమే. అయితే ఈ మూవీలోనే హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆలోచిస్తున్నారట.
ఇక ఇదే విషయమై జాన్వీని వారు సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. ఆమె ఓకే చెబితే.. విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్‌గా నటించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఈమె టాలీవుడ్‌లో చేసే రెండో మూవీ ఇది అవుతుంది. వాస్తవానికి లైగర్ సినిమాలోనే ఆమెను నటింపజేయాలని అనుకున్నారట. కానీ కాల్‌షీట్స్ లభ్యం కాలేదట. అందువల్ల ఈమూవీలో తప్పక ఆమెను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక దీనిపై అధికారికంగా త్వరలోనే వివరాలను తెలియజేయనున్నట్లు సమాచారం.