Ileana : నడుము అందాల భామ ఇలియానా దేవదాసు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇలా ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ వైపు వెళ్లింది.

సౌత్ ఇండస్ట్రీ లో వచ్చినంత క్రేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు రాలేదనే చెప్పాలి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన సినిమాలు ఏ మాత్రం విజయం సాధించకపోవడంతో తిరిగి దక్షిణాది సినిమా ఇండస్ట్రీ వైపు తిరిగి చూసింది. ఇక దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు క్రమక్రమంగా తగ్గి పోయాయి. అయితే ఈమె అప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. దీంతో సినిమా అవకాశాలు రాకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే చివరకు ఇలియానా ప్రేమలో కూడా ఫెయిల్ అయింది. ఈ క్రమంలో ఈమె కొన్నాళ్ల పాటు బయటి ప్రపంచానికి దూరంగా ఉంది. డిప్రెషన్‌లోకి వెళ్లింది. కానీ ఈ మధ్య కాలంలో మళ్లీ యాక్టివ్‌గానే ఉంటోంది.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో రీ ఎంట్రీ కోసం ఈమె పడుతున్న కష్టాలు మామూలుగా లేవు. గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటుందీ ముద్దుగుమ్మ. తాజాగా ఎదపై చెమటలు చిమ్ముతూ ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే ఈ విధంగానైనా ఈమెకు అవకాశాలు వస్తాయో.. రావో.. చూడాలి.