కరోనా రెండవ దశ దేశవ్యాప్తంగా ఎంతటి ప్రళయం సృష్టిస్తుందో మనకు తెలిసిందే. ఈ వైరస్ చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరిని పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో ,మధుమేహం వంటి సమస్యతో బాధపడే వారిలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. ఈ విధమైనటువంటి వ్యాధులతో బాధపడేవారు ఎంతో జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా మధుమేహ సమస్యతో బాధపడే వారిలో కరోనా తీవ్రత అధికంగా ఉంటుంది.
మధుమేహ సమస్యతో బాధపడేవారు కరోనా బారిన పడితే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కరోనా బారిన పడితే కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వంటి సమస్యలతోపాటు స్కిన్ ర్యాషెస్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.మధుమేహంతో బాధపడే వారిలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్లే ఈ విధమైనటువంటి చర్మ సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
కరోనా తో బాధపడేవారిలో నిమోనియా కూడా ఒక సమస్య. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారిలో తీవ్రత అధికంగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ ఉండకపోవడం వల్ల శ్వాసకోస సమస్యలు కూడా తలెత్తుతాయి.అదేవిధంగా ఆక్సిజన్ స్థాయిని కూడా పూర్తిగా తగ్గిపోవడంతో తీవ్రమైన శ్వాసకోస ఇబ్బందులను ఎదుర్కొంటారు. కరోనా బారినపడిన వారిలో మరో కొత్త సమస్య ఏర్పడింది. అదే బ్లాక్ ఫంగస్. ముఖ్యంగా ఈ బ్లాక్ ఫంగస్ మధుమేహంతో బాధపడే వారిలో ఎక్కువగా కనిపిస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.