టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరియర్ మొదట్లో మంచి విజయాలను అందుకున్న నాగచైతన్య తరువాత ఫ్లాపులను చవి చూస్తున్నాడు. ఈ క్రమంలోనే మజిలీ,వెంకీమామ వంటి చిత్రాలతో మరి ఫామ్ లోకి వచ్చిన నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
నాగచైతన్య ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా కరోనా ప్రభావంతో వాయిదా పడింది. ఆ తర్వాత మనం సినిమా దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో “థాంక్యూ” అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది.
ఈ క్రమంలోనే నాగచైతన్య మరో క్రేజీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నాగ శౌర్య చలో, నితిన్ భీష్మ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగచైతన్య సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ విన్న నాగచైతన్య ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా కనుక ఓకే అయితే నాగచైతన్య తన కెరీర్లో మరొక సూపర్ హిట్ ఫిలిమ్ పక్కా అనే సమాచారం బలంగా వినబడుతుంది.