Sunil : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలపై పూర్తి దృష్టి పెడుతూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుకుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలను టార్గెట్ పెట్టుకొని ఇప్పటినుంచే పార్టీలో కసరత్తులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈయన ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో భీమవరం నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పవన్ కల్యాణ్ ఎంతో అమితంగా అభిమానించే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాణస్నేహితుడు, యాక్టర్ సునీల్ ను భీమవరం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే భీమవరం నుంచి సునీల్ ను పోటీలో నిలబెడుతున్నారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నప్పటికీ ఆ మాటలు మాత్రం త్రివిక్రమ్ మాటలని అర్థం అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా రాజకీయ పరంగా పూర్తిగా త్రివిక్రమ్ స్క్రిప్టుపైనే ఆధారపడ్డారని ఆయన ఏం రాస్తే అవే వ్యాఖ్యలు తన నోటిగుండా వస్తాయని అందరూ భావిస్తారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో భీమవరం నుంచి సునీల్ ను నిలబెట్టడం వెనుక కూడా త్రివిక్రమ్ హస్తం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భీమవరం సునీల్ సొంత ప్లేస్ కావడంతో ఆయనకు అభిమానులు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ క్రమంలోనే అభిమానులను క్యాష్ చేసుకుంటూ అక్కడ గెలుపొందడం కోసం పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై సునీల్ తో చర్చించగా తన దృష్టిని మొత్తం సినిమాలపై ఉంచానని తనకు రాజకీయాలు పడవని చెప్పినట్లు తెలుస్తోంది.