Pooja Hegde : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ దళపతి, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం బీస్ట్. శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి అరబిక్ కుతు పాట విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ పాట ఎంతో క్రేజ్ ను సంపాదించుకోగా.. ఎంతో మంది ప్రముఖుల నుంచి సాధారణ అభిమానుల వరకు ఈ పాటకు రీల్స్ చేస్తూ వీడియోలను షేర్ చేశారు. ఇక ఈ పాట ఎంతో మంచి క్రేజ్ దక్కించుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ జాలీ ఓ జింఖానా అనే పాటను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రోమో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా దర్శకుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత వాయిద్యాలను వాయిస్తూ ఉండగా.. పూజా హెగ్డె, విజయ్ ఈ పాటను ఆలపిస్తూ ఉన్నారు.
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పూర్తి పాటను ఈ నెల 19వ తేదీ విడుదల చేయనున్నారు. ఇక ఈ ప్రోమోని పూజా హెగ్డె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రెండో రౌండ్ కు సిద్ధంగా ఉన్నారా ? ఈ పాటకు డాన్స్ చేయడం మర్చిపోకండి.. అంటూ కోరింది. మరి ఈ పాట కూడా అరబిక్ కుతు పాటలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.. లేదో.. వేచి చూస్తే తెలుస్తుంది.