Prabhas Marriage : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ఠక్కున అందరూ ప్రభాస్ పేరు చెబుతారు. ఈయన పెళ్లి గురించి గత దశాబ్ద కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదే మరో ఏడాదే.. అంటూ చెబుతూ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు.
ఈ క్రమంలోనే ప్రతిసారీ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ పెళ్లి వార్త సంచలనంగా మారుతోంది. తాజాగా మరోసారి ఈయన పెళ్లి వార్త హాట్ టాపిక్ గా మారింది. అందుకు గల కారణం జ్యోతిష్యుడు వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా జ్యోతిష్యుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభాస్ కి ఈ ఏడాది తప్పనిసరిగా వివాహం జరుగుతుందని చెప్పారు.
ఈ క్రమంలోనే జ్యోతిష్యుడు వినోద్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. వినోద్ కుమార్ తెలియజేస్తూ అక్టోబర్ 2022 నుంచి అక్టోబర్ 2023 మధ్యలో తప్పకుండా ప్రభాస్ పెళ్లి జరుగుతుందని జ్యోతిష్యం కూడా ఇదే చెబుతుందని ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈయన పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన చెప్పిన ప్రకారమే ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి జరిగితే అభిమానులకు నిజంగానే పండుగ అని చెప్పవచ్చు.