Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన వ్యాపారాలను కూడా ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుపుతోంది. ఇప్పటికే తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి సస్టైన్ కార్ట్ లో ఇన్వెస్ట్ చేసింది. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పుడు సమంత సినిమాలలో నటిస్తూనే సాకీ, ఏకమ్ లెర్నింగ్ స్కూల్, సస్టైన్ కార్ట్ వంటి సమస్థలను నడుపుతోంది.

ఇలా పలు వ్యాపారాలను ఎంతో విజయవంతంగా నిర్వహిస్తూ మరోవైపు ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో ఎంతో మంది హీరోయిన్లు ఆల్కహాల్ కు సంబంధించిన బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రెజీనా, రకుల్, కాజల్, పూజా హెగ్డే వంటి వారు వివిధ రకాల ఆల్కహాల్ బ్రాండ్లను ప్రమోట్ చేశారు. ఇక వీరి బాటలోనే నటి సమంత కూడా మరొక ఆల్కహాల్ బ్రాండ్ కి ప్రమోషన్ చేస్తోంది.
ఈ క్రమంలోనే సమంత బ్లెండర్స్ ప్రైడ్ విస్కీ బ్రాండ్ కి ప్రమోటర్ గా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ఈ బ్రాండ్ కోసం సమంత నటించిన ప్రకటన మరీ శృతిమించి పోయిందనే చెప్పాలి. ఈ ప్రకటన కోసం సమంత గ్లామర్ డోస్ పెంచి పూర్తిగా అందరినీ కైపెక్కిస్తోంది. ఇక ఈ వీడియో ద్వారా సమంత తన కాస్ట్యూమ్స్ అలాగే బ్లెండర్స్ ప్రైడ్ ఆల్కహాల్ ను కూడా ప్రమోట్ చేస్తూ రచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రకటనలో సమంత ఎద అందాలను ఆరబోస్తూ రచ్చ చేసింది. దీంతో ఆమెను ఇలా చూసిన వారు షాకవుతున్నారు. సమంత ఏంటి ? అందాల ప్రదర్శన తరువాత.. మద్యం తాగమని ప్రోత్సహించడం ఏమిటి ? అంటూ ఆమెను విమర్శిస్తున్నారు.