Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు కన్నా.. జయమ్మ అంటేనే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తు పడతారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్, రవితేజ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం క్రాక్. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయిగా కనిపించారు. ఇలా ఈ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే వరుస తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా చెన్నై నుంచి హైదరాబాద్ కి మకాం మార్చింది. అయితే ఇలా ఉన్నఫలంగా చెన్నై వదిలిపెట్టి హైదరాబాద్ రావడానికి గల కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. పుట్టి పెరిగిన ప్రదేశాన్ని వదిలి వరలక్ష్మి శరత్ కుమార్ హైదరాబాద్ రావడానికి గల కారణం ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు రావడమేనని అంటున్నారు.
అందుకోసమే వరుసగా షూటింగ్‌ల కోసం హైదరాబాద్ కు రావాల్సి ఉండగా ఈమె ఏకంగా హైదరాబాద్ కే మకాం మార్చింది. అయితే నిజంగానే వరలక్ష్మి శరత్ కుమార్ చెన్నై వదిలి హైదరాబాద్ రావడానికి ఇదే కారణమా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ఖరీదైన ప్రాంతంలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉన్నారు. త్వరలోనే ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.