Divi : హీరోయిన్స్, నటీమణులు, మోడల్స్.. ఇలా ఎవరైనా సరే సినిమాల్లో అవకాశాలు రావాలంటే.. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో గ్లామర్ షో చేయక తప్పడం లేదు. ఇక బుల్లితెరపై మెరుస్తున్న కొందరు నటీమణులు కూడా గ్లామర్ షో చేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేమ్ దివి ఒకరని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె మీడియా లైమ్‌లైట్‌లో ఉండేందుకు అనేక తంటాలు పడుతోంది.
దివి ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో నటించింది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు భిన్నమైన ఫొటోషూట్స్ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాలని ఈమె ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ అవుట్‌ఫిట్‌లో దివి షర్ట్ బటన్స్ విప్పేసి తన ఛాతి మీద ఉన్న టాటూను చూపిస్తూ మతులు పోగొడుతోంది.
దివి ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తుండగా.. రీసెంట్‌గా చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీలోనూ నటించే చాన్స్ కొట్టేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈమె ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ షో చేస్తోంది.