Viral Video : సమాజంలో ఉన్న జీవాలు అన్నీ ఒక్కటే. గేదె అయినా ఆవు అయినా.. ఆఖరికి కుక్క అయినా.. ఏ జీవి అయినా దేవుడి సృష్టిలో ఒక్కటే. అన్నింటిదీ ఒకే ప్రాణం. అవును సరిగ్గా ఇలా భావించాడు కనుకనే ఆయన తన ప్రాణాలు పోతాయని తెలిసినా.. తెగించి మరీ.. ధైర్య సాహసాలతో వరద నీటిలో కొట్టుకుపోతున్న ఓ కుక్కను రక్షించాడు. అందరిచే ప్రశంసలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో హోమ్ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ముజీబ్ ఉర్ రహమాన్ స్థానికంగా ఓ నదిలో వరద నీటిలో కొట్టుకుపోతున్న కుక్కను చూశాడు. వెంటనే స్థానికులకు సమాచారం అందించి జేసీబీని తెప్పించాడు.
జేసీబీని వరద నీటిలోకి రప్పించి అక్కడ తాను నిలుచుని నెమ్మదిగా కుక్కను నీటి నుంచి బయటకు తీశాడు. అనంతరం జేసీబీ సహాయంతో కుక్కను వాగు నుంచి బయటకు తీశాడు. తరువాత దాన్ని గ్రామంలో వదిలేశాడు. ఆ సమయంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తేడా వస్తే రహమాన్ కూడా కొట్టుకుపోయి ఉండేవాడే. కానీ అత్యంత చాకచక్యంగా ఆయన ఆ కుక్కను వరద నీటి నుంచి రక్షించాడు.
तेज़ लहरों के बीच फंसे कुत्ते को देखकर @TelanganaCOPs के होम गार्ड मुजीब ने तुरंत JCB बुलाई और खुद उसे बचाने के लिए लहरों में उतर गए. उनके जज्बे को दिल से सलाम.
मानवता की सेवा के लिए #Khaakhi कोई भी जोखिम उठाने से पीछे नहीं हटती. pic.twitter.com/sJlBoOwvov— Dipanshu Kabra (@ipskabra) January 25, 2022
ఈ క్రమంలో రహమాన్ అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. ప్రాణాలకు తెగించి మరీ ఆ శునకాన్ని రక్షించినందుకు అందరూ ఆయనను అభినందిస్తున్నారు. కాగా ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కాబ్రా ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది.