Radhe Shyam : ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా గురించి లిరిక్ రైటర్ కృష్ణ మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన.. ఈ రాతలే అనే పాటలో సినిమా మొత్తాన్ని తెలియజేశారని అందరూ భావించారు.
ఈ సినిమాలో ఈ పాటలో కేవలం కొంత మాత్రమే చెప్పామని అసలు సిసలైన కథ ఇంకా ఉందని వెల్లడించారు. ఈ పాట విడుదలతోనే ఎంతో మంచి రెస్పాన్స్ దక్కించుకుందని కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల వారికి కూడా ఎంతగానో నచ్చిందని వెల్లడించాడు. ఈ సినిమా ఒక పునర్జన్మ కథ అని, ఇది ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అనీ సైన్స్ ఫిక్షన్ కథ అనీ ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు, అయితే 1970లో యూరప్‌లో జరిగే ప్రేమ కథ అని స్పష్టం చేశారు.
సాధారణంగా ప్రేమించుకున్న వారు ప్రేమలో విఫలం కావడం సర్వ సాధారణం. మరి ఈ కథలో రాధాకృష్ణులు కలిశారా ? వారి ప్రేమకు ముగింపు పలికారా ? అన్నదే.. ఈ సినిమా అని.. ఈ సందర్భంగా లిరిక్ రైటర్ కృష్ణకాంత్ తెలిపారు. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం కోసం ఐదు పాటలు రాశానని ఈ సందర్భంగా కృష్ణకాంత్ ఈ సినిమా గురించి వెల్లడించారు.