Most Eligible Bachelor : అక్కినేని అఖిల్, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా గత సంవత్సరంలోనే విడుదల కావాల్సి ఉండగా ఎన్నో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన విడుదల అయి బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఎంతో కాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి , అఖిల్ కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు.
ఇక థియేటర్ లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతోంది. దీన్ని త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కడం వల్ల ఈ సినిమా ఆహాలో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం నవంబర్ 19వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు.