రోజూ రిక్షా తొక్కుతూ జీవనం సాగించే కార్మికుడికి కలలో కూడా ఊహించని విధంగా కోటి రూపాయల ఆస్తి కలిసి రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు కలలో కూడా ఇలాంటి సంఘటన జరుగుతుందని భావించని ఆ రిక్షా కార్మికుడికి ఇలా ఓ వృద్ధురాలు కోటి రూపాయలను తన పేరుపై రాయడంతో ఆ కార్మికుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. అయితే ఆ వృద్ధురాలు ఆస్తిని మొత్తం ఆ రిక్షా కార్మికుడికి ఎందుకు ఇచ్చింది, అసలు మ్యాటర్ ఏంటి.. అనే విషయానికి వస్తే..
ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో సంబల్ పూర్ లో మినతి పట్నాయక్ అనే దంపతులు నివసించేవారు. ఈ క్రమంలోనే పట్నాయక్ అనారోగ్యం కారణంగా తన భర్తను పోగొట్టుకుంది. తనకు ఉన్న ఒక్కగానొక్క కూతురు అగ్ని ప్రమాదంలో మృతి చెందింది .అయితే అప్పటి వరకు తనని పలకరించని బంధువులు తన భర్త, కూతురు మరణించడంతో తన దగ్గరికి వచ్చి తనని బాగా చూసుకుంటామాని మాయమాటలు చెప్పి నమ్మించారు. అయితే వారి ఆలోచనలను ముందుగా పసిగట్టిన ఆ వృద్ధ మహిళ తన పేరు మీద ఉన్న ఆస్తులను రిక్షా కార్మికుడు సామల్ అనే వ్యక్తికి రాసి ఇచ్చింది.
కాగా ఆ రిక్షా కార్మికుడు గత కొన్ని సంవత్సరాల నుంచి తమ దగ్గర పని చేస్తున్నాడని, చిన్నప్పటి నుంచి తన కూతుర్ని స్కూల్ కి తీసుకువెళ్లడం, తన భర్తకి అనారోగ్యం చేసినప్పుడు సొంత మనిషిలా దగ్గరుండి తమకు కావాల్సిన సేవలన్నీ చేశాడని, ఆ కృతజ్ఞతతోనే తనకు ఆస్తిని రాసి ఇవ్వడం వల్ల రాబోయే కాలంలో తనకు అండగా ఉంటాడని భావించి.. ఆ నిర్ణయం తీసుకున్నానని.. ఆ వృద్ధురాలు తెలియజేసింది.