ఢిల్లీలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 24వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ముంబై సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో రాజస్థాన్‌పై ముంబై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ సంజు శాంసన్ 27 బంతుల్లో 5 ఫోర్లతో 42 పరుగులు చేయగా, జాస్ బట్లర్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. శివమ్ దూబె 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ 2 వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రిత్ బుమ్రాలకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో క్వింటన్ డికాక్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, క్రునాల్ పాండ్యా 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీయగా, ముస్తాఫిజుర్ రహమాన్‌కు 1 వికెట్ దక్కింది.