Puri Jagannadh : ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ, కేతిక శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. రొమాంటిక్.. ఈ మూవీకి అనిల్ పాదురి దర్శకత్వం వహించారు. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, చార్మీలు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ అక్టోబర్ 29వ తేదీన విడుదల కాబోతోంది.
రొమాంటిక్ చిత్రానికి చెందిన టీజర్, పోస్టర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి ఇప్పటికే చక్కని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీ ద్వారా పూరీ తనయుడు హిట్ తప్పక సాధిస్తాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మూవీలోని పాటకు చార్మీ కౌర్ పెంపుడు కుక్క స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
టీవీలో ఈ మూవీకి చెందిన పాట రాగానే ఆ కుక్క లేచి టీవీ దగ్గరకు వచ్చి మొరుగుతుంది. అది చూసి పూరీతోపాటు అక్కడ ఉన్న వారు ఆశ్చర్యంగా ఫీలయ్యారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో ఆకాష్ పూరీ భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రికి మంచి పేరు తెస్తానని చెప్పాడు.